తెలంగాణలో 10వ తరగతి పరీక్షల్లో ఇంటర్నల్ మార్కుల రద్దు నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం (2024-25) నుంచి ఇంటర్నల్ మార్కులను పూర్తిగా తొలగిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచి ఇంటర్నల్ మార్కుల రద్దు ప్రక్రియ ప్రారంభమవుతుందని తాజాగా ప్రకటించింది.
పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి ఈ విద్యా సంవత్సరం (2024-25) నుంచి గ్రేడింగ్ విధానాన్ని నిలిపివేస్తూ విద్యాశాఖ గురువారం నిర్ణయం తీసుకుంది. ఇంటర్నల్ పరీక్షలకు 20 మార్కులు, వార్షిక పరీక్షలకు 80 మార్కులు విదనాన్ని నిలిపివేస్తూ… ఫైనల్ పరీక్షల్లో ఆరు సబ్జెక్టులను 600 మార్కులకు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే, విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ఇలాంటి నిర్ణయాలను ప్రకటిస్తే విద్యార్థులు మానసికంగా సిద్ధమవుతారని, పరీక్షలకు 4 నెలల ముందు మాత్రమే ప్రకటించడంపై విద్యారంగ నిపుణులు, పలువురు విద్యార్థి సంఘాల నేతలు అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉప సంహరించుకుంది. ఇంటర్నల్ గ్రేడింగ్ రద్దు విధానాన్ని వచ్చే ఏడాది (2025-26) నుంచి నూతన విధానం అమల్లోకి రానుంది.