Tuesday, November 26, 2024

ఉద్యోగాల‌లో చేర‌కుంటే తొలగిస్తాం …పంచాయతీ కార్యదర్శులకు నోటీసులు

హైదరాబాద్‌: జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్‌) చేస్తున్న‌ సమ్మె వెంట‌నే విర‌మించి విధుల‌లో చేరాల‌ని ప్ర‌భుత్వ ఆదేశించింది.. వారు చేస్తున్న‌స‌మ్మెపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపు సాయంత్రం 5 గంటల వరకు జేపీఎస్‌లు విధుల్లో చేరాలని కోరుతూ నోటీసులు జారీ చేసింది. ఒకవేళ విధుల్లో చేరకపోతే ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు పంచాయతీ రాజ్‌ ముఖ్యకార్యదర్శి సందీప్‌ సుల్తానియా నోటీసులు జారీ చేశారు. తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేస్తూ జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు, ఒప్పంద ప్రాతిపదికన పనిచేసే కార్యదర్శులు ఏప్రిల్‌ 29 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement