Tuesday, November 26, 2024

Delhi | సుప్రీంకోర్టులో గవర్నర్ కేసు.. రెండు వారాల అనంతరం తదుపరి విచారణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పెండింగ్ బిల్లుల వ్యవహారంలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌పై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కేసుపై సుప్రీంకోర్టులో విచారణ రెండు వారాలు వాయిదా పడింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం కేసుపై విచారణ చేపట్టగా.. కొన్ని బిల్లలుకు గవర్నర్ ఆమోదం తెలిపారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో 2022 సెప్టెంబర్ నెలలో తెలంగాణ అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులు కొన్ని ఇప్పటికీ పెండింగులో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

అలాగే మరికొన్ని బిల్లలపై గవర్నర్ వివరణ కోరారని తెలిపారు. పంచాయితీ రాజ్‌ చట్ట సవరణ బిల్లు, అజామాబాద్‌ ఇండస్ట్రియల్‌ ప్రాంత చట్ట సవరణ బిల్లులపై ఇంత వరకు న్యాయశాఖ నుంచి ఎలాంటి స్పందన రాలేదని గవర్నర్ సచివాలయం తెలియజేసింది. ఈ మేరకు గవర్నర్ సచివాలయం పంపిన నివేదికను ధర్మసనానికి అందజేయగా, నివేదిక అందినట్టు ధర్మాసనం రికార్డు చేసింది. తదుపరి విచారణ 2 వారాల అనంతరం చేపట్టనున్నట్టు వెల్లడించింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement