Wednesday, December 18, 2024

E-Formula | విచారణకు గవర్నర్ ఆమోదం..

గత ప్రభుత్వ హయాంలో ఈ ఫార్ములా రేసు నిర్వహణకు సంబంధించిన రూ.55 కోట్ల చెల్లింపులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేప‌థ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేటీఆర్ పై ఏసీబీ విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారు.

ఈ ఫార్ములా రేస్ కేసులో మంత్రి కేటీఆర్ ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు లేఖ రాయగా.. గవర్నర్ ఆమోదం తెలిపారు.

ఈ మేర‌కు న్యాయనిపుణుల సలహాలు తీసుకుని గవర్నర్ ఆమోదం తెలిపారని.. సీఎస్ ద్వారా ఏసీబీకి లేఖ పంపుతామని ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలో ఏసీబీకి వెంటనే లేఖ రాయాలని సీఎస్ ను కేబినెట్ ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement