వీసీల నియామకం విషయంలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ రాజకీయంగా జోక్యం చేసుకుంటున్నారని కేరళ సీఎం పినరయి విజయన్ రీసెంట్ గా ఆరోపించారు. దాంతో ఈ వివాదంపై గవర్నర్ స్పందించారు. సీఎం చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు.తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే తాను గవర్నర్ పదవికి రాజీనామా చేస్తానని తేల్చి చెప్పారు. లేనిపక్షంలో మీరు ఆ పని చేస్తారా.. అంటూ సీఎం పినరయికి గవర్నన్ సవాల్ విసిరారు. ఆరెస్సెస్‌కు చెందిన వ్యక్తులను వీసీలుగా నియమించేందుకు గవర్నర్ ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఆరెస్సెస్ కాదు నా అధికారాన్ని దుర్వినియోగం చేసి ఏ వ్యక్తిని నియమించినా నేను రాజీనామా చేస్తా. నాపై చేసిన ఆరోపణలను నిరూపించకపోతే మీరు ఆ పనిచేస్తారా.. అని సీఎం పినరయి విజయన్‌కు గవర్నర్ సవాల్ విసిరారు.మరి గవర్నర్ సవాల్ కి పినరయి ఏం సమాధానం ఇస్తారో చూడాలి.
Advertisement
తాజా వార్తలు
Advertisement