Monday, November 25, 2024

రాజ్‌భవన్‌ పాఠశాల మ్యాగజైన్‌ ఆవిష్కరించిన గవర్నర్‌ తమళి సై సౌందర రాజన్‌

హైదరాబాద్ (ప్రభన్యూస్‌) : విద్యార్థులు చదువుతో పాటు సాహిత్యం, పఠనంపై ఆసక్తిని పెంపొందించుకోవాలని గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌ అన్నారు. హైదరబాదు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పేరుగాంచిన రాజ్‌భవన్‌ ఉన్నత, ప్రాథమిక పాఠశాలకు చెందిన మ్యాగజైన్‌ ను దర్బార్‌ హాలులో గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ‌వ‌ర్న‌ర్‌ మాట్లాడుతూ… విద్యార్థులు చదువుతో పాటు తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో కూడా తమ ప్రతిభను చాటుకోవాలన్నారు. ముఖ్యంగా ఆటలు, పాటలు, పఠనం, క్రీడల్లో విద్యార్థులు రాణించాలన్నారు. తాను చదువుకునే రోజుల్లో కూడా పాఠశాల, కళాశాల్లో కూడా మేగజైన్‌లకు తనవంతుగా ఎన్నో ఆర్టికల్స్‌ రాసేదాననని ఆమె ప్రత్యేకంగా చెప్పారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఉత్సవాలను జరుపుకుంటున్నామని అన్నారు.

విద్యార్థులు దేశ స్వాతంత్య్రం కోసం ఎంతో మంది మహానుభావులు పోరాటం చేశారనీ, వారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మహనీయుల చరిత్రను తెలుసుకోవడం ద్వారా విద్యార్థులు మరింత ఉన్నతంగా ఎదిగే అవకాశం ఉందన్నారు. స్కూల్‌ మేగజైన్‌కు వివిధ రకాల ఆర్టికల్స్‌ కంట్రిబ్యూట్‌ చేసిన విద్యార్థులను గవర్నర్‌ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాకుండా రాజ్‌భవన్‌ అధికారులు విద్యార్థులకు రాజ్‌భవన్‌ అన్నం, బ్రేక్‌ ఫాస్ట్‌ కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో చిరంజీవి, డిప్యూటీ ఐవోఎస్‌ శాంతాబాయి రాథోడ్‌లతో పాటు రాజ్‌భవన్‌ హై స్కూల్‌ హెడ్మాస్టర్‌(హెచ్‌ఎం) కరుణ శ్రీ, ప్రైమరీ పాఠశాల హెడ్మాస్టర్‌ మంజులత, ఉపాధ్యాయుడు సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement