హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ప్రతిభా అవార్డులు-2024 దరఖాస్తు గడువును పొడిగించింది. ఈ పురస్కారాల కోసం నాలుగు విభాగాల్లో 2019 నుండి గత ఐదేళ్లుగా ఆదర్శప్రాయమైన అభివృద్ధికి కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలు, సొసైటీలు, ట్రస్టుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఈ నెల 23 వరకున్న తేదీని 30న సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు మరియు ఆటలు, సాంస్కృతిక విభాగాల్లో ఈ అవార్డుల పంపిణీ ఉంటుందని గవర్నర్ కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి అవార్డు కింద రూ. 2లక్షల నగదు, ప్రశంసా పత్రాన్ని గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎంపికైన గ్రహీతలకు అందజేస్తారు. ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://governor.telangana.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.