అమరావతి, ఆంధ్రప్రభ: అమెరికాలోని ఒరెగాన్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ జావెలిన్ త్రోలో రజత పతకం సాధించిన ఒలింపియన్ నీరజ్ చోప్రాను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. అంజు బాబీ జార్జ్ తర్వాత ప్రపంచ ఈవెంట్‌లో పతకం సాధించిన రెండో భారతీయునిగా నీరజ్ రికార్డులకు ఎక్కారని, 88.13 మీటర్ల లక్ష్యాన్ని సాధించి దేశం గర్వించేలా చేశారని గవర్నర్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో అన్నారు.
భవిష్యత్ ఈవెంట్‌లలో మరింత మెరుగైన ప్రతిభను చూపాలని, తద్వారా మరిన్ని విజయాలు సాధించాలని బిశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.