తిరుమల, ప్రభన్యూస్ : తిరుమల శ్రీవారిని శనివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న గరవర్నర్‌కు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి సాదరంగా ఆహ్వానించారు. అర్చక బృందం ఇస్తికఫాల్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన ధ్వజస్తంభానికి నమస్కరించి శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం రంగనాయకుల మండపంలో గవర్నర్‌కు వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో తీర్థ ప్రసాదాలు అందించారు. అంతకు ముందు పద్మావతి అతిథిగృహాల వద్దకు చేరుకున్న గవర్నర్ కు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, టీటీడీ ఈవోలు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు రమేష్‌బాబు, హరీంద్రనాథ్, ఆర్డీవో కనకనరసారెడ్డి, వీజీవో బాలిరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..