ప్రభుత్వాలు సంపన్నుల కోసం పనిచేస్తున్నాయని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి అన్నారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాయావతి విపక్ష పార్టీలపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వాలు ప్రజల కోసం పని చేయడానికి బదులు కొంత మంది సంపన్నుల కోసం పని చేస్తున్నాయని విమర్శలు గుప్పించారు. పార్టీల పాలసీలు కార్పొరెట్లకు అనుకూలంగా ఉంటాయని అందుకే అధికారంలోకి రాగానే ప్రజా ధనాన్ని కొర్పొరెట్లకు దోచి పెడుతున్నారని అన్నారు. కార్పొరెట్ల కోసం పని చేయని పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది ఒక్క బీఎస్‌పీ మాత్రమే అని మాయావతి అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement