ఖమ్మం : పేదలకు ప్రతి నిత్యం వైద్యం అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండాలని బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లోని 34వ డివిజన్ లో 27.50 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను, యోగ కేంద్రాన్ని మంత్రి పువ్వాడ ప్రారంభించారు. కార్పొరేట్ స్థాయికి మించి ప్రభుత్వం వైద్య సేవలు, చికిత్సలు, శాస్త్ర చికిత్సలు ఆందిస్తుందని పేర్కొన్నారు. పేదలు, సామాన్యుల సౌకర్యార్థం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అన్ని అధునాతన సేవలు అందిస్తుందని వివరించారు. ప్రజలు ప్రభుత్వ వైద్యాన్ని సద్వినియోగించుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ గౌతమ్, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, డిసిసిబి చైర్మన్ కురకుల నాగభూషణం, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, డీఎంహెచ్ వో డాక్టర్ బీ.మాలతీ, పార్టీ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, కార్పొరేటర్ రుద్రగాని శ్రీదేవి ఉపేందర్, జిల్లా నాయకులు ఆర్జేసి కృష్ణ, ఆశ్రీఫ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement