అమరావతి, ఆంధ్రప్రభ : ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తూ అక్రమ అరెస్టులకు పాల్పడిందంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయాలని అడిగితే అరెస్ట్ చేస్తారా అంటూ మండిప డ్డారు. శనివారం విజయవాడలో టీఎన్‌ఎస్‌ఎఫ్ నేతల అరెస్ట్ ను ఆయన తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగ కలలు సాకారం చేస్తామని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చాక వాటిని మర్చిపోయారని విమర్శించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక నిరుద్యోగం 14 శాతం పెరిగిందని గడిచిన రెండున్నరేళ్లలో 400 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి జగన్ మర్చిపోవడం వల్లే యువత రోడ్డెక్కుతుందని అన్నారు. ఎన్నికల హా మీల మేరకు తక్షణమే జాబ్ క్యాలండర్‌ను విడుదల చేయాలని, అలాగే నిరుద్యోగ యువతపై పెట్టిన కేసును కూడా ఎత్తివేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
నిరుద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదు..
నిరుద్యోగులకు ఇచ్చిన హామీను ప్రభుత్వం విస్మరించిందని టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బ్రహ్మం చౌదరి అన్నారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఇచ్చిన హామీల మేరు 2.35 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయకుంటే నిరుద్యోగులు, యువత ఆగ్రహానికి గురికాక తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వంపై నిరసన తెలి పిన నిరుద్యోగ యువతను అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. గతంలో పేర్కొన్న ఉద్యోగాల సంఖ్య ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకు తగ్గిందో చెప్పాలని బ్రహ్మం చౌదరి డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించని పక్షంలో యువజన సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..