దేశీయ చమురు ఉత్పత్తిపై విండ్‌పాల్ ప్రాఫిట్ పన్నును సమీక్షించాలని చమురు మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ పన్ను ఆర్థిక స్థిరత్వా సూత్రానికి విరుద్ధంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నందున దీనిపై సమీక్షించాలని నిర్ణంచింది. ఉత్పత్తి భాగస్వామ్య ఒప్పందం(పీఎస్‌సీ), ఆదాయ భాగస్వామ్య ఒప్పందం(ఆర్‌ఎస్‌సీ) కింద ఉన్న చమురు సంస్థలకు రెండున్నర నెలల పాటు పాత లేవీ నుంచి చమురు క్షేత్రాలు, బ్లాక్స్‌లను మిన్హయించాలని చమురు శాఖ నిర్ణయించింది.
రెవెన్యూ షేరింగ్‌లో చమురు కంపెనీలకు లాభాలు పెరిగితే ఆ మేరకు ప్రభుత్వానికి లేవీ రూపంలో ఆదాయం వస్తోంది. దీన్నే ఓఎన్‌జీసీ కూడా ఎత్తి చూపింది. లాభాల్లో వాటాలు పొందుతూ, మళ్లిd లాభాలపై విండ్‌పాల్ పన్ను వేయడం అనైతికమని ఓఎన్‌జీసీ అభిప్రాయపడింది. అందుకే విండ్‌పాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. 1990 నుంచి కంపెనీలకు చమురు వెలికితీసేందుకు కాంట్రాక్ట్ విధానంలో ప్రభుత్వం బ్లాక్‌లను కేటాయిస్తోంది.
ఇలా కేటాయించిన వాటి నుంచి ప్రభుత్వం రాయాల్టిdని, సెస్‌లను పొందుతుంది. కేంద్ర ప్రభుత్వం చమురు, గ్యాస్ ధరలపై 10 నుంచి 20 శాతం వరకు రాయాల్టిdని వసూలు చేస్తోంది. దీనితో పాటు ప్రభుత్వ రంగ సంస్థలైన ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా లకు కేటాయించిన క్షేత్రాల నుంచి ఉత్పత్తి అవుతున్న చమురుపై 20 శాతం సెస్ వసూలు చేస్తోంది. ఉత్పత్తి షేరింగ్ ఒప్పందం కింద కేటాయించిన క్షేత్రాల నుంచి ప్రభుత్వానికి లాభంపై 50 నుంచి 60 శాతం ఆదాయం వస్తోంది. ఇక రెవెన్యూ షేరింగ్ కాంట్రాక్ట్ కింద విండ్‌పాల్ లాభాలు పొందుతోంది. కంపెనీలు విండ్‌పాల్ లాభాల కంటే కూడా లేవీనే ఎక్కువ చెల్లించారని తెలిపింది.
జులై 1 నుంచి ప్రభుత్వం విండ్‌పాల్ ప్రాఫిట్ ట్యాక్స్ విధించింది. చమురు ఎగుమతులపై కంపెనీలు అధిక లాభాలు పొందుతున్నాయని భావించిన ప్రభుత్వం ఈ పన్నులు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం విండ్‌పాల్ ప్రాఫిట్ పన్నును డీజిల్, పెట్రోల్, విమాన ఇంధనంపై విధించింది.
విండ్‌పాల్ పన్నుపై ప్రది 15 రోజులకోసారి సమీక్షిస్తారు. స్థానికంగా ఉత్పత్తి అవుతున్న ముడి చమురుపై ప్రభుత్వం అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని వసూలు చేస్తోంది. ఇది టన్నుకు 23,250 రూపాయలు అదనపు సెస్ వసూలు చేస్తోంది. 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తున్నారు. ఇలా 5 సార్లు సమీక్ష తరువాత ప్రస్తుతం ఈ పన్ను టన్నుకు 10,500కు తగ్గింది.
విండ్‌పాల్ పన్నును తాము పరిశ్రమ వర్గాలతో చర్చించిన తరువాతే విధించామని ఇటీవలే ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు.