Friday, November 15, 2024

AP | ఐఐటీ మద్రాస్‌తో ప్రభుత్వం కీలక ఒప్పందాలు!

రాజధాని అమరావతిని అంతర్జాతీయస్థాయి నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంది.

ఐఐటీ మద్రాస్ ప్రతినిధులతో శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించిన అనంతరం మంత్రి నారా లోకేష్ సమక్షంలో కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఏపీ సీఆర్డీఏ, మారీటైం బోర్డు, స్కిల్ డెవలప్మెంట్, విద్య, ఇన్వెస్టిమెంట్ & ఇన్‌ఫ్రా స్ట్రక్చర్, ఐటి, ఆర్టీజిఎస్ శాఖలతో స‌హా మొత్తం ఎనిమిది అంశాలపై ఏపీ ప్రభుత్వం, ఐఐటీ మద్రాస్ మధ్యన ఒప్పందాలు కుదిరాయి.

అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దటంలో సాంకేతిక సలహాలు ఇవ్వడంతో పాటుగా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, అత్యాధునిక పరిశోధనలు నిర్వహించడం వంటి అంశాల్లో ఏపీ ప్రభుత్వం ఐఐటీ మద్రాస్ మధ్యన ఒప్పందాలు జరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement