ఢిల్లీలో నిషేధం విధించినా భారీగా బాణసంచా కాల్చారు ప్రజలు.. ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనంతో కాలుష్యం విపరీతంగా పెరిగింది. పంజాబ్, హర్యానాలో పొలాల మంటల నుంచి వెలువడిన పొగ దేశ రాజధాని వైపు వచ్చింది. దాంతో గాలి నాణ్యత 3,4రోజుల్లో సాధారణ స్థాయికి రావొచ్చని అధికారులు వెల్లడించారు. దీపావళి టపాసుల ప్రభావం దేశ రాజధాని ఢిల్లీ, దాని చుట్టుపక్కల ప్రాంతాలపై తీవ్రంగా పడింది. దాంతో ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుకుంది. గాలి నాణ్యత పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గురువారం సాయంత్రం 4 గంటలకు గాలిలో నాణ్యత దారుణంగా దిగజారింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 382గా నమోదుకాగా.. రాత్రి 8 గంటలక మరింత తీవ్రమయ్యింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 314 నుంచి 341 వద్ద ఉండగా, దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చడంతో నోయిడాలో ఏక్యూఐ526కు పెరిగింది.ఏక్యూఐ 500 దాటిందంటే తీవ్రమైన కాలుష్యం ఏర్పడిందని తేలింది.పటాకుల వ్యతిరేక ప్రచారం చేయడంతోపాటు 13,000 కిలోలకు పైగా అక్రమ పటాకులను స్వాధీనం చేసుకొని, 33 మందిని అరెస్టు చేసినట్లు ప్రభుత్వ అధికారులు చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement