Tuesday, October 22, 2024

పవన్‌ కల్యాణ్‌ సభకు ప్రభుత్వం ఆటంకాలు… జనసేన కార్యకర్తలకు పోలీసుల నోటీసులు

అమరావతి, ఆంధ్రప్రభ : ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్చూరులో ఈనెల 19న ఆదివారం పవన్‌ కళ్యాణ్‌ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్రకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రకాశం జిల్లాలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన అంగలకుర్తి సుమంత్‌ కుటుంబాన్ని శనివారం నాదెండ్ల పరామర్శించి పార్టీ తరపున రూ 2 లక్షల ఆర్ధికసాయం అందించారు. ఈ సందర్భంగా కొత్తపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ , పర్చూరు సభకు వెళితే అరెస్టులు చేస్తామంటూ జనసేన కార్యకర్తలను, రైతులను పోలీసులు బెదిరిస్తున్నారనీ..కొన్ని చోట్ల నోటీసులు కూడా ఇస్తున్నారని అన్నారు. కౌలు రైతులను అండగా నిలబడేందుకు పవన్‌ కల్యాణ్‌ వస్తుంటే సీఎం జగన్‌ గుండెల్లో రైళ్ళు పరుగెత్తుతున్నాయని నాదెండ్ల వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లా పర్చూరుకు పవన్‌ వస్తుంటే అక్కడికి వెళ్లొద్దంటూ కడప జిల్లాలో రైతులకు నోటీసులు ఇస్తున్నారంటే జగన్‌ ప్రభుత్వం ఏ స్థాయిలో భయపడుతుందో అర్ధం చేసుకోవాలన్నారు.

పోలీసులు తమ బెదిరింపునూ, నోటీసులను ఆపకపోతే స్సెషల్‌ మెన్షన్‌ పిటిషన్‌ ద్వారా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళతామని తెలిపారు. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గానికి చెందిన తమ పార్టీ వీర మహిళ పర్చూరు సభకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంటే పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి నోటీ-సులు ఇచ్చారు. పర్చూరు సభకు వెళ్తే అరెస్టు చేస్తామని బెదిరించారు. ఇంత కంటే దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఉంటు-ందా అని నాదెండ్ల మండిపడ్డారు. రాష్ట్ర స్థాయిలో వేల మంది రైతులను ఆదుకుంటు-న్న పవన్‌ కల్యాణ్‌ ను అభినందించాల్సింది పోయి అవమానపర్చేలా మాట్లాడుతున్నారని అన్నారు. కౌలు రైతు కుటు-ంబాలను ఆదుకుంటు-ంటే ముఖ్యమంత్రి తట్టు-కోలేకపోతున్నారు. జగన్‌ పరిపాలన నిజాయితీగా ఉంటే కౌలు రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారని నాదెండ్ల ప్రశ్నించారు. మీడియా సమావేశంలో పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్‌ రియాజ్‌, ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్‌ కుమార్‌, పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement