Saturday, November 23, 2024

ప్ర‌కృతి వ్య‌వ‌సాయాన్ని ప్ర‌భుత్వం ప్రోత్స‌హిస్తోంది : సీఎం జ‌గ‌న్

ప్ర‌కృతి వ్య‌వ‌సాయాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రోత్స‌హిస్తోంద‌ని, ప్ర‌కృతి వ్య‌వ‌సాయం ఈరోజుల్లో శ్రేయ‌స్క‌ర‌మ‌ని సీఎం జ‌గ‌న్ అన్నారు. మధ్యాహ్నాం పులివెందులలో ఏపీకార్ల్‌ వద్ద న్యూటెక్‌ బయోసైన్సెస్‌కు శంకుస్థాపన చేశారు. ఈసంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ… ఆహార ఉత్పత్తుల్లో రసాయనాలను తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ప్రకృతి వ్యవసాయంపై రైతుల్లో అవగాహన పెంచాలని.. వ్యవసాయం శాస్త్రవేత్తలు గ్రామాలపై దృష్టి సారించాలని సూచించారు.

రసాయనాలతో కూడిన ఆహారం వల్ల ఎన్నో రకాల క్యాన్సర్లు వస్తున్నాయన్నారు. ఆహార ఉత్పత్తుల్లో రసాయనాలను తగ్గించాలన్నారు. ఏపీలో ఆరు లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు గ్రామాలపై మరింత దృష్టిసారించాలన్నారు. గ్రామస్థాయి నుంచి శిక్షణ అవసరమ‌న్నారు. ప్రకృతి వ్యవసాయంపై రైతుల్లో అవగాహన పెంచాలన్నారు. ఆర్బీకేల ద్వారా అవసరమైన శిక్షణ అందిస్తున్నామ‌న్నారు. ప్రకృతి వ్యవసాయంపై అంతర్జాతీయ సంస్థలతో మన ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంటోందన్నారు. రైతుల పెట్టుబడి వ్యయాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తరపున పలు చర్యలు చేపడుతున్నామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement