బీసీల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే ప్రభుత్వం తమదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. హైదరాబాద్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్‌గా పల్లె రవికుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు గంగుల కమలాకర్, జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. బీసీలు వెనుకబడ్డ వారు కాదని గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకకు నెట్టేయబడ్డారన్నారు. బీసీల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే ప్రభుత్వం తమదని, కల్యాణ లక్ష్మి రైతుబంధు, రైతుబీమా తదితర పథకాల్లో బీసీలదే మెజార్టీ వాటా అన్నారు. బీసీలతోపాటు యావత్ తెలంగాణ సమాజానికి రాష్ట్రాన్ని సాధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనలేని సేవ చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా కేసీఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. అభివృద్ధి కోసం నీరాకేఫ్‌ను ప్రారంభించడంతోపాటు గౌడబీమాను ప్రకటించారని చెప్పారు. కల్లుగీత వృత్తిదారుల కార్పొరేషన్ చైర్మన్‌గా ఉద్యమకారుడు, బీసీ బిడ్డ అయిన పల్లె రవికుమార్‌కు అవకాశం కల్పించారని చెప్పారు. ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రంలోని గౌడ వృత్తిదారులందరికీ సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement