Tuesday, November 26, 2024

చైనా కరోనా రూల్‌.. కఠిన ఆంక్షలు విధించిన ప్రభుత్వం

చైనా కరోనా కొత్త మార్గదర్శకాలు.. అమెరికా విమానాన్ని తిరిగి పంపించేలా చేశాయి. షాంఘైలో ల్యాండ్‌ కావాల్సిన డెల్టా విమానం.. చైనా ఆదేశాల కారణంగా తిరిగి సీటెల్‌కు వెళ్లిపోయింది. ఒక రోజు ముందు చైనా ప్రభుత్వం విడుదల చేసిన కరోనా కఠిన ఆంక్షలే దీనికి కారణమని డెల్టా ఎయిర్‌వేస్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రత్యామ్నాయ విమానాల్లో రీ బుకింగ్‌ కోసం కొనసాగిస్తున్నామని, ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, ఇందుకు క్షమించాలని ఆయన కోరారు. గడువు ముగిసిన వీసాలు, కరోనా పరీక్షలతో చాలా మంది చైనీస్‌ పౌరులు విమానంలో చిక్కుకుపోయారని శాన్‌ఫ్రాన్సిస్కోలోని చైనీస్‌ కాన్సులేట్‌ ఫిర్యాదు చేసింది. డెల్టాతో పాటు ఇతర యూఎస్‌ విమాన సంస్థలు వేలాది విమాన సేవలను రద్దు చేశాయి. ఒమిక్రాన్‌ వేరియంట్‌ సెగ.. ఎయిర్‌లైన్‌ కార్మికులను కూడా తాకింది. ఇతర దేశాల మాదిరిగానే.. చైనా కూడా అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించి.. కరోనాపై పోరాడుతున్నది.

కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు నగరం చుట్టూ కార్లు నడపడంపై కూడా నిషేధం విధించారు. రానున్న ఆరు వారాల్లో బీజింగ్‌లో వింటర్‌ ఒలింపిక్స్‌ గేమ్స్‌ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు చైనా ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు అమలు చేస్తోంది. బీజింగ్‌కు 1000 కి.మీ దూరంలో జియాన్‌ నగరం ఉంది. వారంలో 300 కంటే ఎక్కువ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గతం కంటే ఇవి ఎంతో ఎక్కువ. 13 మిలియన్‌ల మంది ప్రజలు లాక్‌డౌన్‌లో ఉన్నారు. ప్రతీ రెండు రోజులకు ఒకసారి.. ఒక ఇంట్లో నుంచి ఒకే వ్యక్తి.. బయటికి రావాలి. అత్యవసరమైన వస్తువులు కొనుగోలు చేసి వెళ్లిపోవాలనే నిబంధన అక్కడి ప్రభుత్వం అమలు చేస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement