Friday, November 22, 2024

TS | నవంబర్‌ 30న ప్రభుత్వ సెలవు.. పోలింగ్‌ నేపథ్యంలో ఉత్తర్వులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పోలింగ్‌ రోజైన నవంబర్‌ 30న ప్రభుత్వ సెలవును ప్రకటిస్తూ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటింగ్‌ దినం డిసెంబర్‌ 3 ఆదివారం కావడంతో అధికారికంగా నాడు సెలవు దినమే కానుంది. అయితే దీనికి ఉద్యోగులకు చెల్లింపులు చేయనున్నారు. పోలింగ్‌ రోజున ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు అధికారికంగా సెలవును ప్రకటించారు.

ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ పరంగా వడివడిగా ఏర్పాట్లు, అవసరమైన నిధుల విడుదలకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సోమవారం ఈ మేరకు పోలింగ్‌ నిర్వహణ, ఏర్పాట్ల నిమిత్తం ప్రభుత్వం వేర్వేరుగా పలు ఉత్తర్వులు విడుదల చేసింది. ఈవీఎంలు, వీవీప్యాట్‌ల స్టోరేజీ నిమిత్తం రూ. 19.45 కోట్లను విడుదల చేసింది.

- Advertisement -

వీవీప్యాట్‌లు, ఈవీఎంల స్టోరేజీకిగానూ వేర్‌హౌజ్‌ల నిర్మాణానికి ఈ నిధులను వినియోగించనున్నారు. సోషల్‌ మీడియా, ప్రధాన మీడియాలో ప్రకటనలు, పెయిడ్‌ ఆర్టికల్స్‌ను పరిశీలించేందుకు రాష్ట్రస్థాయి మీడియా సర్టిఫికేషన్‌ మానిటరింగ్‌ కమిటీని ప్రకటించింది. సీఈవో ఈ కమిటీకి చైర్మన్‌గా ఉండనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement