మల్లంపల్లి గ్రామ ప్రజల కల సాకారమైంది. ములుగు నియోజకవర్గంలోని మల్లంపల్లి గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే మల్లంపల్లిని మండలంగా ఏర్పాటవడంతో స్థానిక ఎమ్మెల్యేగా సీతక్క సంబరపడ్డారు. మండలం కోసం అలుపెరగని పోరాటం చేసి మండలాన్ని సాధించుకున్న మల్లంపల్లి ప్రాంత ప్రజలకు ఈ సందర్భంగా సీతక్క శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ‘మల్లంపల్లి ప్రాంత ప్రజల పదేళ్ల ఆకాంక్ష. మల్లంపల్లి ప్రత్యేక మండలం కోసం ప్రజలు పదేళ్లుగా ఎన్నో పోరాటాలు చేశారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసి మల్లంపల్లి మండల ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు. ఇప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు’ అంటూ సీతక్క తెలిపారు.