తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రెండు ప్రాజెక్టుల పేర్లను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి పేరు పెట్టారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇక నుంచి.. ఎస్.జైపాల్ రెడ్డిని పీఆర్‌ఎల్‌ఐ ప్రాజెక్టుగా పిలుస్తారు.
దీంతో పాటు సింగూరు ప్రాజెక్టు పేరును కూడా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు మంత్రి దామోదర రాజనర్సింహ తండ్రి, దివంగత కాంగ్రెస్ నాయకుడు రాజనర్సింహ పేరు పెట్టారు. ఈ మేరకు రాష్ట్ర ఈ రోజు నీటిపారుదల శాఖ ఉత్తర్వులను జారీ చేసింది.