తెలంగాణలో జూనియర్ కాలేజీ ఆడ్మిషన్స్ సరవేగంగా పూర్తవుతున్నాయి. ఇప్పటి వరకు ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ 1,00,685 వరకు దాటాయి. గతేడాది కన్నా 25 వేల అడ్మిషన్లు అదనంగా వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలతో ఈ సంవత్సరం సర్కార్ జూనియర్ కాలేజీల్లో రికార్డ్ స్థాయిలో అడ్మిషన్స్ నమోదయ్యాయి. అంతేకాదు కరోనా కారణంగా ప్రైవేట్ కాలేజీల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు విముఖత చూపుతున్నారు. రాష్ట్రంలోని ఫలక్‌నుమా జూనియర్ కాలేజీలో అత్యధికంగా 2,550 విద్యార్థులు చేరారు. సర్కార్ జూనియర్ కాలేజీల్లో సీఈసీ గ్రూప్‌కి ఎక్కువ డిమాండ్ ఉంది.
ఇది కూడా చదవండి: శ్రీశైలం మల్లన్న సేవలో అమిత్ షా..