Friday, November 22, 2024

అమెరికా గ్రీన్‌ కార్డు కోసం గోటబాయ దరఖాస్తు

శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్ష అమెరికా గ్రీన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఇటీవల ఆ దేశ ప్రజలు ఉద్యమించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రాజపక్ష దేశాన్ని విడిచి పారిపోయారు. ప్రస్తుతం థాయిలాండ్‌లో ఉన్న రాజపక్ష.. గ్రీన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఓ రిపోర్ట్‌ వెల్లడైంది. భార్య, కుమారుడు కూడా గ్రీన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఆ రిపోర్ట్‌లో తెలిపారు.

వాస్తవానికి నవంబర్‌ వరకు గోటబాయ థాయ్‌లాండ్‌లో ఉండాలని అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఆయన తిరిగి ఈనెలలోనే శ్రీలంకకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. గోటబాయ రాజపక్ష భార్య ఐవోమా రాజపక్ష అమెరికా పౌరురాలు. ఈ నేపథ్యంలో గత నెలలోనే గ్రీన్‌ కార్డుకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement