Wednesday, November 20, 2024

గోరింటాకు ఔషధకారి..

పరిగి, (ప్రభ న్యూస్‌) : పేరట్లలో పెంచిన చెట్టుకి గోరింటాకు కోసి రుబ్బి ఓపిగ్గా పెట్టుకొని రాత్రంతా జాగారం చేసే వారు. తెల్లవారేసరికి చేతులు శుభ్రంగా కడుక్కుని ఎర్రగా పండిన చేతులను చూసుకొని మురిసి పోయేవారు. బంధువులు స్నేహితురాళ్ళు తోటి ఆడవాళ్ళతో ఒకరికొకరు చేతులు చూపించుకుంటూ సంబరపడే వారు. పెళ్లి కాని వారి చేతులు బాగా ఎర్రగా పండితే ఎర్రని రంగు కలిగిన భర్త వస్తాడని నల్లగా పండితే నల్లని భర్త వస్తాడని ప్రచారంలో కూడా ఉండేది. ఉమ్మడి కుటుంబాలు అయితే పేరాళ్ల లో ఉన్న చెట్టుకు ఓకే సారీ గోరింటాకు కోసుకొని చేతులకు పెట్టుకుంటూ ఒక పండుగలా జరుపుకునేవారు. అయితే గోరింటాకును ఔషధ కారిగా కూడా వినియోగించడం విశేషం.

వర్షాకాలంలో గృహిణులకు తరుచూ నీళ్లు తగిలి కాలి వేళ్ళు గోరులకు కురుపులు వచ్చేవి అయితే వీటి నుంచి ఉపశమనానికి గోరింటాకు పెట్టు-కునే వారు. గోరింటాకు మనిషి శరీరంలోని అధిక వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది. ఇటీవల వచ్చిన కొన్ని రకాల కోన్ల వల్ల చర్మ వ్యాధులు ఇతర సమస్యలు వస్తున్నాయి. దీంతో ఆలస్యమైనా మహిళలు సహజసిద్ధమైన గోరింటాకు ను కొనుగోలు చేయడం లేదా పెరటిలో పెంచిన చెట్టుకు కోసుకొని రుబ్బి రాసుకుంటారు. గతంలో కేవలం చేతులు కాళ్ళ కె గోరింటాకు రాసుకునేవారు ప్రస్తుతం జుట్టు కూడా ఈ గోరింటాకు పెట్టుకుంటున్నారు. ఇదోరకం సల్గా మారింది. గోరింటాకు ఎండబెట్టి పౌడర్‌ గా చేసి టీ పొడి డికాషన్‌ లలో కలిపి నిమ్మకాయ పిండి అరగంట పాటు ఊరబెట్టి ఆ పేస్టును తలకు పట్టించి నాలుగు గంటల తరువాత కడుక్కుంటే తెల్లబడిన జుట్టు అంత ఎర్రగా మారుతుంది. ప్రస్తుతం ఇళ్లలోని పెరట్లో, కుండీలలో గోరింటాకు పెంచి వినియోగించుకుంటున్నారు

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement