Monday, November 18, 2024

శేఖర్ మాస్టర్‌ను చంపేసిన గూగుల్.. మండిపడుతున్న అభిమానులు

టాలీవుడ్ సూపర్ డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ అంటే ఇష్టపడని వారు ఉండరు. సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండటమే కాకుండా బుల్లి తెర పై పలు కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్న శేఖర్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా తన కూతురు, కొడుకుతో పలు వీడియోలు చేస్తూ ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నారు. ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న శేఖర్ మాస్టర్ అభిమానులకు గూగుల్ ఒక చేదు వార్తని చెప్పింది.

గూగుల్‌లో శేఖర్ మాస్టర్ అని టైప్ చేయగానే వెంటనే శేఖర్ మాస్టర్ ఫోటోతో పాటు అతని పుట్టిన తేదీ, అతను మరణించిన తేదీని చూపించడంతో శేఖర్ మాస్టర్ అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. జూలై 8, 2003లో శేఖర్ మాస్టర్ చనిపోయినట్లు చూపించడంతో ఆయన అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అయితే గూగుల్ ఇలా చూపించడానికి కూడా ఒక కారణం ఉంది. తమిళం, మలయాళం సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టుగా శేఖర్ నటించారు. అందరూ ఇతనిని మాస్టర్ శేఖర్‌గా పిలుచుకునేవారు. మాస్టర్ శేఖర్ తెలుగులో ‘అక్కా తమ్ముడు’ సినిమాలో తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలితకు తమ్ముడు పాత్రలో నటించి మెప్పించాడు. చైల్డ్ ఆర్టిస్టెగా ఎంటరైన మాస్టర్ శేఖర్ దాదాపు 50 సినిమాలకు పైగా నటించారు. ఈ క్రమంలోనే మాస్టర్ శేఖర్ జులై 8, 2003లో మరణించారు. దీంతో గూగుల్ సెర్చ్‌లో శేఖర్ మాస్టర్ అని సెర్చ్ చేయగానే కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఫోటో రావడంతో పాటు అతడు మరణించిన తేదీని కూడా చూపించడంతో అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: నారప్ప సక్సెస్‌పై వెంకటేష్ రియాక్షన్

Advertisement

తాజా వార్తలు

Advertisement