Tuesday, November 26, 2024

వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల గూగుల్‌కు రూ.7,500 కోట్లు ఆదా

గత ఏడాది నుంచి కరోనా వైరస్ దేశాన్ని గడగడలాడిస్తోంది. ఈ కరోనా కాలంలోనే ఉద్యోగులకు దొరికిన ఓ మంచి అవకాశం వర్క్ ఫ్రమ్ హోమ్. ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లకుండా ఇంటివద్దే ఉండి పనిచేయడం వల్ల అటు ఉద్యోగులకు, ఇటు కంపెనీలకు కొంత ఊరట లభించింది. కార్పొరేట్ సంస్థలకు, ఉద్యోగులకు ఇద్దరికీ ఈ కాన్సెప్ట్ బాగా కలిసొచ్చిందనే చెప్పాలి.

ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం వల్ల గత ఏడాది నుండి ఇప్పటివరకు లాభపడిన కంపెనీల్లో గూగుల్ సంస్థ అగ్రస్థానంలో ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా తమకు ఏడాది కాలంలో దాదాపు రూ. 100 కోట్ల డాలర్లు అనగా భారత కరెన్సీలో దాదాపు రూ.7500 కోట్లు ఆదా అయినట్లు గూగుల్ వెల్లడించింది. బ్లూమ్‌బర్ల్ విడుదల చేసిన నివేదిక ప్రకారం గూగుల్పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ తొలి త్రైమాసికంలో ఉద్యోగుల ప్రయాణ ఖర్చులు, కంపెనీ ప్రచారం, వినోద ఖర్చులపై 26.8 కోట్ల డాలర్లు ఆదా చేసినట్లు తెలిపింది. ఇక ఇలానే మరికొన్ని రోజులు ఈ విధానం కొనసాగితే కంపెనీకి 100 కోట్ల డాలర్లకు పైగా తగ్గే అవకాశం ఉంటుందని అంచనా. ఒక్క గూగుల్ మాత్రమే కాకుండా ఫేస్ బుక్, ట్విట్టర్, యాపిల్ లాంటి కంపెనీలు కూడా మంచి లాభాలనే పొందినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement