Friday, November 22, 2024

భార‌త్ మార్కెట్ లో గూగుల్ పిక్సెల్ 8 సిరీస్.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో స‌రికొత్త స్మార్ట్‌ఫోన్

టెక్ దిగ్గజం గూగుల్ ఏటా లాంచ్ చేసే పిక్సెల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు ప్రీమియం ఫీచర్లతో చాలామందిని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా “మేడ్ బై గూగుల్” ఈవెంట్‌లో ఈ కంపెనీ పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ వెంట్‌లో పిక్సెల్ 8 , పిక్సెల్ 8 ప్రో ఫోన్ల‌తో పాటు పిక్సెల్ వాచ్ 2 లాంచ్ ని రిలీజ్ చేసింది గూగుల్.

ఈ ఫోన్ల‌ను లేటెస్ట్ టెక్నిక‌ల్ ఫీచ‌ర్ల‌తో లంచ్ చేసింది కంపెనీ.. గూగుల్ పిక్సెల్ ఫోన్‌లు సేఫ్ ఫేస్ అథెంటికేషన్ వంటి అనేక కొత్త ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. లేటెస్ట్ టెన్సర్ G3 ప్రాసెసర్‌తో పాటు బ్లూటూత్ 5.3, 10.5MP సెల్ఫీ కెమెరా, 1TB వరకు స్టోరేజీ, 120Hz OLED డిస్‌ప్లే వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఈ సిరీస్ ఫోన్లలో అందించారు. వీటి ధర, ఫీచర్ల వివరాలు తెలుసుకుందాం…

గూగుల్ పిక్సెల్ 8 ధర

- Advertisement -

గూగుల్ పిక్సెల్ 8 ధర రూ.75,999 గా నిర్ణ‌యిచింది క‌పెనీ. అయితే కొనుగోలుదారులు రూ.8,000 బ్యాంక్ డిస్కౌంట్‌తో పాటు రూ.3,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్‌తో ధరను రూ.64,999కి తగ్గించుకోవచ్చు. పిక్సెల్ 8 ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడే ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు.

గూగుల్ పిక్సెల్ 8 ప్రో ధర

భారతదేశంలో గూగుల్ పిక్సెల్ 8 ప్రో 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,06,999. కొనుగోలుదారులు రూ.9,000 బ్యాంక్ డిస్కౌంట్, రూ.4,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను పొందవచ్చు. తద్వారా రూ.93,999కే ఈ మొబైల్ సొంతం చేసుకోవచ్చు. పిక్సెల్ 8 ప్రో ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. 2023, అక్టోబర్ 12 నుంచి ఈ ఫోన్ సేల్స్ ప్రారంభమవుతాయి.

గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ డిజైన్

పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో ఫోన్లు ప్రీవియస్ మోడల్స్‌తో పోలిస్తే కొన్ని కీలకమైన మార్పులతో వచ్చాయి. కొత్త ఫోన్లలో కెమెరాలు వెనుక భాగంలో ఒకే బార్‌లో గ్రూపుగా అందించారు. పిక్సెల్ 8 ప్రోలో కొత్త మ్యాట్ గ్లాస్ బ్యాక్ కూడా ఉంది, పిక్సెల్ 8 గ్లాస్ బ్యాక్‌తో వస్తోంది. రెండు ఫోన్లు 100% రీసైకిల్ అల్యూమినియం, కనీసం 18% రీసైకిల్ మెటీరియల్స్‌తో తయారయ్యాయి. పిక్సెల్ 8 ప్రో పోర్సెలైన్ (Porcelain), అబ్సిడియన్, బే అనే మూడు రంగులలో అందుబాటులో ఉంది. పిక్సెల్ 8 అబ్సిడియన్, హాజెల్, రోజ్ వంటి మూడు రంగులలో లభిస్తుంది.

పిక్సెల్ 8 ప్రో, పిక్సెల్ 8 స్పెసిఫికేషన్లు

పిక్సెల్ 8 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.2-అంగుళాల FHD+ OLED డిస్‌ప్లేతో లాంచ్ అయ్యింది. పిక్సెల్ 8 ప్రో మొబైల్ 6.7-అంగుళాల LTPO OLED డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 2,400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. రెండు ఫోన్లలో టైటాన్ M2 సెక్యూరిటీ కోప్రాసెసర్‌తో గూగుల్ టెన్సర్ G3 చిప్‌సెట్ అందించారు. రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో లాంచ్ అయ్యాయి. పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్ 8GB+128GB, 8GB+256GB స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది. పిక్సెల్ 8 ప్రో 12GB+128GB, 12GB+256GB, 12GB+512GB వంటి మూడు స్టోరేజీ ఆప్షన్స్‌లో లభిస్తుంది.

పిక్సెల్ 8 ఫోన్ 27W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 4,575mAh బ్యాటరీ కెపాసిటీ ఆఫర్ చేస్తుండగా.. పిక్సెల్ 8 ప్రో 30W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,050mAh బ్యాటరీతో లభిస్తుంది. రెండు ఫోన్లలో బ్లూటూత్ 5.3, ఫేస్ ఐడి, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, IP68 రేటింగ్ ఉన్నాయి. పిక్సెల్ 8 పిక్సెల్ 8 ప్రో కంటే చిన్నగా, బరువు తక్కువగా ఉంటుంది. పిక్సెల్ 8 Pro 7 ఏళ్ల వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ పొందుతుంది.

పిక్సెల్ 8లో 50MP వైడ్ కెమెరా, 12MP అల్ట్రావైడ్ కెమెరాతో డ్యుయల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను అందించారు. పిక్సెల్ 8 ప్రోలో 50MP వైడ్ కెమెరా, 48MP అల్ట్రావైడ్ కెమెరా, 30x వరకు జూమ్‌తో కూడిన 48MP టెలిఫోటో లెన్స్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను ఆఫర్ చేశారు. రెండు ఫోన్లు 10.5MP ఫ్రంట్ కెమెరాతో వస్తాయి.

గూగుల్ పిక్సెల్ వాచ్ 2 :

గూగుల్ ప్రొడక్టుల్లో ఒకటైన పిక్సెల్ వాచ్ 2ని కూడా కంపెనీ ఆవిష్కరించింది. గత వాచ్ వెర్షన్‌తో పోలిస్తే డిజైన్, యాక్టివిటీ రెండింటిలోనూ కొన్ని అద్భుతమైన అప్‌గ్రేడ్స్ అందిస్తుంది. పిక్సెల్ వాచ్ 2 ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. 100 శాతం రీసైకిల్ అల్యూమినియంతో రూపొందించింది. పర్యావరణ అనుకూలతను మాత్రమే కాకుండా గత మోడల్ కన్నా 10శాతం తేలికగా ఉంటుంది. వాచ్‌లో పెద్ద క్రౌన్ కూడా ఉంటుంది.

హుడ్ కింద, సున్నితమైన కొత్త క్వాడ్-కోర్ CPU ద్వారా అందిస్తుంది. తక్కువ-పవర్ కో-ప్రాసెసర్‌ ద్వారా ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండేలా డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాదు.. 24-గంటల బ్యాటరీ లైఫ్, అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్‌లలో ఒకటి. అదనంగా, ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది, కేవలం 30 నిమిషాల్లో 50శాతం బ్యాటరీని అందిస్తుంది.

సరికొత్త హెల్త్ ఫీచర్లు.. 3 కొత్త సెన్సార్లు

పిక్సెల్ వాచ్ 2 మోడల్ 3 కొత్త సెన్సార్‌లను కలిగి ఉంది. అప్‌గ్రేడ్ ఫీచర్లలో హార్ట్ రేట్ సెన్సార్, మల్టీ LEDలతో అమర్చారు. వ్యాయామాల సమయంలో కూడా అత్యంత కచ్చితమైన రీడింగ్‌లను అందిస్తుంది. ఫిట్‌బిట్ బాడీ రెస్పాన్స్ ఫీచర్, నిరంతర ఎలక్ట్రోడెర్మల్ యాక్టివిటీ (CEDA) సెన్సార్‌ని ఉపయోగించి, మానసిక ఒత్తిడి సంకేతాలను గుర్తించగలదు.

వినియోగదారులకు మార్గదర్శకాన్ని అందిస్తుంది. అదనంగా, నిద్ర విధానాలను, మొత్తం ఆరోగ్యాన్ని విశ్లేషించడానికి రాత్రిపూట స్కిన్ టెంపరేచర్‌ను మానిటరింగ్ చేయగలదు. (Wear OS 4)తో, పిక్సెల్ వాచ్ 2 కస్టమైజడ్ యూజర్ ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఇందులో నోటిఫికేషన్‌లను యాక్సస్ చేసుకోవచ్చు. జీమెయిల్, క్యాలెండర్ వంటి కొత్త యాప్‌లను కూడా కలిగి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement