Friday, November 22, 2024

గూగుల్ పిక్సెల్ 8 లాంఛ్ అప్పుడే.. కొత్త ఫోన్ లో స‌రికొత్త ఫీచ‌ర్లు..

స్మార్ట్ ఫోన్ రంగంలో గూగుల్ దూసుకుపోతుంది. త‌మ కంపెనీ నుంచి లాంచ్ చేసి గూగుల్ పిక్సెల్ సిరీస్ కు మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. కాగా, పిక్సెల్ సిరీస్ లో ఇప్ప‌టివ‌ర‌కు 7 జెన‌రేష‌న్స్ ఫోన్స్ లాంచ్ అవ్వ‌గా రీసెంట్ గా 8వ జెన‌రేష‌న్ అయిన గూగుల్ పొక్సెల్ 8 ఫోన్ రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించింది గూగుల్. పిక్సెల్ 7 సిరీస్ కు కొనసాగింపుగా వస్తున్న ఈ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లను అక్టోబర్ 4న లాంఛ్ చేయనున్నట్లు వెల్ల‌డించింది.

ఇక ఎప్పటిలాగనే పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో మోడల్స్ ఈ సిరీస్ లో రానున్నాయి. వీటికి సంబంధించిన డిజైన్ కూడా ఇటీవలే లీక్ అయింది. ఇతర ఫీచర్లు, స్పెసిఫికేషన్లకు సంబంధించిన వివరాలపై కూడా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. న్యూయార్క్ లో అక్టోబర్ 4 న రాత్రి 10 గంటల సమయంలో లాంఛ్ కార్యక్రమం జరగనుంది.

పిక్సెల్ 8 సిరీస్ ఫోన్లు కేవలం రెండు రంగులు (బ్లాక్, వైట్) లోనే రానున్నట్లు తెలుస్తోంది. అయితే గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ఫోన్లు ‘‘ఆడియో మ్యాజిక్ ఏరేజర్’’ ఫీచర్ తో రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ తో వస్తున్న తొలి, ఏకైక ఫోన్ ఇదేనని గూగుల్ తెలిపింది. ఆడియో మ్యాజిక్ ఏరేజర్ ఫీచర్ తో వీడియోల్లోని అన్ వాంటెడ్ ఆడియాను తొలిగించవచ్చు. ఇక‌ గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ మోడల్స్ లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కెమెరా, గూగుల్ కెమెరా అప్లికేషన్ న్యూ ఇంటర్ ఫేస్ ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు దీనిపై కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement