Pixel 6a భారతదేశంలో కొనుగోలు చేయడానికి అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. గూగుల్ నంచి వచ్చిన ఈ బడ్జెట్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ కోసం భారత్ లో జూలై 21 నుండి ప్రీ-ఆర్డర్‌లను తీసుకోవడం ప్రారంభించింది. కాగా, ఇప్పుడు పిక్సెల్ 6a చివరకు దేశంలో సేల్స్ కు రెడీగా ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో ఈ స్మార్ట్ ఫొన్ అందుబాటులో ఉంది.
Google Pixel 6a ధర..
భారతదేశంలో పిక్సెల్ 6a ఏకైక వేరియంట్ 6GB/128GB మోడల్ ధర రూ.43,999గా ఉంది. అదనంగా, పిక్సెల్ బడ్స్ ప్రో కూడా కూడా అందుబాటులో ఉంది, ఈ పిక్సెల్ బడ్స్ రూ.19,990 లో లబిస్తాయి. Pixel 6a, Pixel Buds Pro ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.
Axis బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ ద్వారా Pixel 6a కొనుగోలుపై రూ.2,000 తగ్గింపును అందిస్తోంది ఈ కంపెనీ. ఇక ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లకు 5 శాతం క్యాష్‌బ్యాక్‌కు కూడా వస్తుంది. అంతే కాకుండా గూగుల్ పిక్సెల్, ఇతర స్మార్ట్‌ఫోన్‌లపై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా అందిస్తోంది. ఇంకో విషయం ఏంటంటే.. కస్టమర్ Pixel 6a పర్చేస్ తో Pixel Buds Series-Aని రూ.4,999కి, Google Fitbit Inspire 2ని రూ.4,999కి పర్చేస్ చేసుకోవచ్చు.
Google Pixel 6a స్పెసిఫికేషన్..
Pixel 6a 429ppi పిక్సెల్ తో 6.1-అంగుళాల FHD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 60Hz రిఫ్రెష్ రేట్, HDRకి సపోర్ట్ చేస్తుంది. Pixel 6a ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ రీడర్‌తో వస్తుంది. 6GB LPDDR5 RAM, 128GB UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది. 4,410 mAh బ్యాటరీ.. 18W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ బరువు 178g, 9mm కంటే తక్కువ మందం కలిగి ఉంటుంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ కోసం IP67 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది. ఫైనల్ గా ఈ స్మార్ట్ ఫోన్ చాక్, చార్‌కోల్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.