Friday, November 22, 2024

Tech: గూగుల్‌ మెకానికల్‌ వెయిటర్‌!

కరోనా అనంతరం టెక్‌ కార్యాలయాలు మళ్లిd తెరుచుకుంటున్నాయి. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ నుంచి ఉద్యోగులు ఆఫీసులకు వచ్చేస్తున్నారు. పనిభారం కూడా పెరుగుతోంది. ఒక్కొక్కసారి భోజనానికి వెళ్లేందుకు కూడా చాలినంత సమయం లభించని సందర్భాలు ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో మన డెస్క్‌పైకి ఎవరైనా చిప్‌ ్స లేదా సోడా బాటిల్‌ తీసుకొస్తే ఎంతబాగుటుందో అనిపిస్తుంది. టెక్‌ దిగ్గజం గూగుల్‌ సరిగ్గా ఇలాంటి ఆలోచనతో రోబోట్‌ను తయారు చేసింది.

సరికొత్త మెకానికల్‌ వెయిటర్‌ను సృష్టించింది. సాధారణ ఆదేశాలతోపాటు వర్చువల్‌ చిట్‌బాట్‌ వంటి సంభాషణల్లోనూ పాల్గొనడం దీని ప్రత్యేకత. ఈ మెకానికల్‌ వెయిటర్‌లు కృత్రిమ మేథస్సును కలిగివుంటాయి. అల్ఫాబెట్‌ ఇంక్‌ అనుబంధ సంస్థ ‘ఎవ్రీడే రోబోట్స్‌ ‘ ద్వారా రోబోట్‌లను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం అవి స్నాక్స్‌ని తీసుకొచ్చే పనులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయి. మార్కెట్‌లోకి రావడానికి మరికొంత సమయం పడుతుందని గూగుల్‌ రోబోటిక్స్‌ పరిశోధన సీనియర్‌ డైరెక్టర్‌ విన్సెంట్‌ వాన్‌హౌక్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement