ప్రభన్యూస్: గూగుల్ ఇండియా యూ ట్యూబర్లకు శుభవార్త చెప్పింది. భారత్ లో యూట్యూబ్ షార్ట్స్ టైమ్ డ్యూరే షన్‌పై కీలక ప్రకటన చేసింది. షార్ట్స్ వీడియోస్‌లో 15సెకన్లు అంతకంటే తక్కువ టైమ్ డ్యూరేషన్ ఉన్న వీడియోలు చేసేందుకు అనుమతిస్తున్నట్లు గూగుల్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుల్లో సంతోషం వ్యక్తం అవుతుంది. 2020 సెప్టెంబర్‌లో గూగుల్..యూట్యూబ్ షార్ట్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ షార్ట్స్‌లో 60సెకన్లు నిడివి ఉన్న వీడియోలు చేయాలి.
అయితే ఇప్పుడు వీడియోల నిడివి 15సెకన్లుకు తగ్గించారు. ఆన్లైన్లో డబ్బును సంపాదించుకునేందుకు ఈ ప్లాట్‌ఫాం మంచి అవకాశం. నిమిషాల వ్యవధి వీడియోల కంటే సెకన్ల వ్యవధి వీడియోలు చేయడం చాలా సులభం. వ్యూస్ పెరగటంతోపాటు ఛానల్ బ్రాండింగ్ పుంజుకుంటుంది. యూట్యూబ్ షార్ట్స్ ద్వారా గుర్తింపు పొందిన కంటెంట్ క్రియేటర్లకు ప్రతి నెలా డబ్బులు సంపాదించే అవకాశం లభిస్తుంది. టిక్ టాక్ గత సంవత్సరం క్రియేటర్స్ఫండ్ పేరుతో రెండు వందల మిలియన్ డాలర్లను కేటాయించింది. అదేవిధంగా యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ల కోసం వంద మిలియన్ డాలర్లు 2021-2022 సంవత్సరానికి కేటాయించింది. మనదేశంలో టిక్‌టాక్ లేకపోవడంతో అంతా యూట్యూబ్ షార్ట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..