చమురు దిగుమతి భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపి వినియోగించడాన్ని కేంద్రం ప్రోత్సహిస్తూ వస్తోంది. దీని వల్ల రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుంది. పర్యావరణానికి మేలు జరుగుతుంది. ప్రస్తుతం పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలిపి విక్రయిస్తున్నారు. భవిష్యత్‌లో పూర్తిగా ఇథనాల్‌తో నడిచే వాహనాలను తీసుకురానున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. నాగపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇథనాల్‌తో నడిచే వాహనాల గురించి చెప్పారు.
మెర్సిడెజ్ బెంజ్ ఛైర్మన్‌తో తాను భేటీ అయిన సందర్భంగా భవిష్యత్‌లో తాము తీసుకురానున్న వాహనాలన్నీ విద్యుత్‌వే ఉంటాయని చెప్పారని నితిన్ గడ్కరీ తెలిపారు. అదే విధంగా ఇక నుంచి పూర్తిగా ఇథనాల్‌తో నడిచే స్కూటర్లను, బైక్‌లను బజాజ్, టీవీఎస్, హీరో కంపెనీలు తీసుకు రానున్నాయని గడ్కరీ చెప్పారు. పెట్రోల్‌తో పోల్చితే ఇథనాల్ వల్ల ఎంతో ఆదా అవుతుందని, పెట్రోల్ లీటర్ 120 రూపాయల వరకు ఉంటే, ఇథనాల్ లీటర్ 60 రూపాయలు మాత్రమే ఉందన్నారు.