Friday, November 22, 2024

లహరికి విశేష స్పందన.. ప్రయాణికులకు మెరుగైన సేవలే లక్ష్యం : ఎండి సజ్జన్నార్‌

హెదరాబాద్‌, ఆంధ్రప్రభ : టీఎస్‌ ఆర్టీసీ తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చిన నాన్‌ ఏసి స్లీపర్‌ కమ్‌ సీటర్‌ స్లీపర్‌ బస్సులకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తెలంగాణ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించే లక్ష్యంతో టీఎస్‌ ఆర్టీసీ లహరి బస్సులను ప్రవేశపెట్టింది. ఈ బస్సులో ప్రయాణించిన ఇద్దరు ప్రయాణికుడు లహరి బస్సులో ప్రైవేటుకు దీటుగా అన్ని సౌకర్యాలు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే, సుఖవంతమైన ప్రయాణానికి అనువుగా బెర్తులు, వైఫై, మొబైల్‌ చార్జింగ్‌ వంటి సౌకర్యాలు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. బస్సు సిబ్బంది ప్రయాణికులతో వ్యవహరించే తీరు కూడా చాలా బాగుందనీ, బస్సులను కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

ప్రజలు టీఎస్‌ ఆర్టీసీ లహరి బస్సులలోనే ప్రయాణించాలని సూచించారు. ఈ వీడియోను టీఎస్‌ ఆర్టీసీ ఎండి సజ్జన్నార్‌ సోమవారం ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేస్తూ లహరి బస్సులకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ఈ మాటల ప్రేరణతో మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీఎస్‌ ఆర్టీసీ యాజమాన్యం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ప్రయాణికులకు తక్కువ ఖర్చుతోనే ఉత్తమ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీఎస్‌ ఆర్టీసీ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా సజ్జన్నార్‌ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement