Sunday, November 24, 2024

అంగన్‌వాడీలకు తెలంగాణ సర్కారు శుభవార్త

తెలంగాణలోని అంగన్‌వాడీ, మినీ అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు గౌరవ వేతనాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల 30 శాతం పీఆర్సీ పెంచిన నేపథ్యంలో ఈ వర్గానికి కూడా వేతన పెంపును వర్తింపచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంగన్‌వాడీ టీచర్లకు గతంలో రూ.10,500 వేతనం ఉండగా.. దానిని రూ.13,650కి పెంచారు. మినీ అంగన్‌వాడీ టీచర్లకు గతంలో రూ.6వేలు జీతం ఉండగా.. రూ.7,800 చొప్పున పెంచారు. మరోవైపు అంగన్‌వాడీ ఆయాలకు రూ.6వేలు వేతనం ఉండగా వాళ్లకు కూడా రూ.7,800 వేతనం ఖరారు చేశారు. కాగా ఈ వేతనాల పెంపు జూలై నుంచి వర్తిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. కాగా అంగన్‌వాడీలకు వేతనాలు పెంచినందుకు తెలంగాణ అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్స్ అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ వార్త కూడా చదవండి: హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనంపై హైకోర్టు ఆగ్రహం

Advertisement

తాజా వార్తలు

Advertisement