Monday, November 18, 2024

గుడ్ న్యూస్‌.. సబ్బులు, డిటర్జెంట్‌ ధరలు తగ్గింపు!

ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీ హిందూ స్థాన్‌ యూనిలీవర్‌ సబ్బులు, డిటర్జెంట్‌ ధరలు తగ్గించింది. ప్రొడక్ట్‌ను బట్టి 2 నుంచి 19 శాతం మేర ధరలు తగ్గించినట్లు కంపెనీ తెలిపింది. ముడి సరకు ధరలు పెరగడంతో హిందూస్థాన్‌ యూనివలీవర్‌ (హెచ్‌యూఎల్‌)తో పాటు పలు కంపెనీలు విడతల వారీగా ధరలను పెంచాయి. ముడిసరకు ధరలు కొంత దగ్గడంతో హెచ్‌యూఎల్‌ ఈ నిర్ణయం తీసుకుంది. సవరించిన ధరలు ఉన్న స్టాక్‌ ఈ నెల చివరికి మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది.


ధరలు తగ్గేవి…
హెచ్‌యూఎల్‌ అమ్మే సర్ఫ్‌ ఎక్సెల్‌ లిక్విడ్‌ 500 ఎంఎల్‌ ధర ప్రస్తుతం 115 రూపాయలుగా ఉంది, ఇది 112కు తగ్గనుంది. రిన్‌ రిజర్జెంట్‌ కేజీ పౌడర్‌ ధర 103 నుంచి 99 రూపాయలకు తగ్గనుంది. లైఫ్‌బాయ్‌ 125 గ్రాముల 4 సబ్బులు ఉండే ప్యాక్‌ ధర 140 నుంచి 132 రూపాయలకు తగ్గనుంది. 50 గ్రాముల డవ్‌ సబ్బు ధర 27 నుంచి 22 రూపాయ లకు తగ్గుతుంది. తగ్గిన ధరల సమాచారాన్ని కంపెనీ డీలర్లకు తెలిపింది.
అదేబాటలో గోద్రెజ్‌
మరో ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీ గోద్రెజ్‌ కంపెనీ కూడా ధరలు తగ్గించాలని నిర్ణయించింది. గోద్రెజ్‌ కొన్నింటి ధరలు తగ్గించి, బరువు పెంచింది. 10 రూపాయలకు లభించే నెం 1 సబ్బును 41 గ్రాముల నుంచి 50 గ్రాములకు పెంచింది. అదే సబ్బు ప్యాక్‌ ధరను 140 నుంచి 120 రూపాయలకు తగ్గించింది. పామాయిల్‌ ధరలు భారీగా పెరిగినప్పుడు ధరలు పెంచిన కంపెనీలు వాటి ధరలు తగ్గడంతో ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు కంపెనీలు బదిలీ చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement