Friday, November 22, 2024

గుడ్​న్యూస్​.. గుంటూర్ బాలుడికి మంకిపాక్స్‌ నెగిటివ్‌..

గుంటూరు, ప్రభన్యూస్‌ : మంకిపాక్స్‌ లక్షణాలతో జీజీహెచ్‌లో చేరిన ఏమిదేళ్ల బాలుడికి నెగిటివ్‌ వచ్చిందని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభావతి తెలిపారు. మంకీపాక్స్‌ అనుమానిత లక్షణాలతో రాహువ్‌ నహక్‌(8) జీజీహెచ్‌లో చేరాడు. చికిత్స పొందుతున్న రాహువ్‌ నుంచి జీజీహెచ్‌ అధికారులు వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం శాంపిల్స్‌ సేకరించారు. ఒడిశాకు చెందిన బనిత నహక్‌, గౌడ నహక్‌లు తమ కుమారుడు రాహువ్‌ నహక్‌తో కలిసి ఒడిశా నుంచి యడ్లపాడు స్పిన్నింగ్‌మిల్లుకు కొద్ది రోజుల కిందట వచ్చారని పేర్కొన్నారు.

ఒంటిపై గుల్లలు రావడంతో చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తీసుకువచ్చారని, ప్రత్యేక వార్డులో బాలుడిని అడ్మిట్‌ చేసి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. బాలుని నుంచి రక్త నమూనాలను సేకరించి పుణలోని వైరాలజి ల్యాబ్‌ కు పంపించామని ఆమె చెప్పారు. ల్యాబ్‌ నివేదిక ప్రకారం నెగిటివ్‌ ఉన్నట్లు నిర్థారణ అయ్యిందన్నారు ప్రస్తుతం బాలుని ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉందని ఆమె వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement