రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త వినిపించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో తెల్ల రేషన్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి సన్న బియ్యం అందజేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. కొత్త సంవత్సరంలో సంక్రాంతి పండుగ తర్వాత రేషన్ కార్డులు ఉన్న వారందరికీ ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
సూర్యాపేట జిల్లా గడ్డిపల్లిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు శుంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. పేదలకు ఉచితంగా సన్న బియ్యం అందిస్తామని పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో ఈ వానాకాలం 150 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండిందని.. రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధికమని పేర్కొన్నారు. సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 30.50 లక్షల రేషన్ కార్డు దారులకు ఉచితంగా ఆరు కిలోల సన్నబియ్యాన్ని అందించనున్నట్టు తెలిపారు. ఈ సన్న బియ్యాన్ని జనవరి 2025 నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ చేయనున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.