WhatsApp యూజర్లకు గుడ్ న్యూస్. వినియోగదారులకు కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌లో లేని నంబర్‌ల నుండి వచ్చే ఇన్‌కమింగ్ కాల్‌ను సైలెంట్ చేసే ఫీచర్ ను వాట్సాప్ కొత్తగా ప్రవేశపెట్టింది. Meta వ్యవస్థాపకుడు, CEO మార్క్ జుకర్‌బర్గ్ వాట్సాప్‌లో సైలెన్స్ అన్‌నోన్ కాలర్స్ అనే ఈ కొత్త ప్రైవసీ ఫీచర్‌ను ప్రకటించారు. WhatsApp తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఫీచర్‌తో ఇన్‌కమింగ్ కాల్స్‌పై మరింత ప్రైవసీ లభించనుంది. స్పామ్, ప్రాంక్ కాల్స్, షేడీ కాలర్‌లకు అడ్డుకట్ట వేసేలా ఈ ఫీచర్ ఉండనుంది. అయితే.. వాట్సాప్ వాడేవారు సైలెన్స్ అన్‌నోన్ కాలర్స్ ఫీచర్‌ని ఎనేబుల్ చేసుకోవడం ద్వారా తెలియని కాంటాక్ట్‌ల నుండి వచ్చే కాల్స్‌ని ఆటోమేటిక్‌గా బ్లాక్ చేయచ్చు.
Update For Android : ఆండ్రాయిడ్ ఫోన్లలో అన్ నోన్ కాల్స్ ని బ్లాక్ చేయడం ఎలాగో వివరంగా తెలుసుకుందాం. వాట్సాప్ ఓపెన్ చేసి టాప్ రైట్ సైడ్ ఉన్న 3 డాట్స్ ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత సెట్టింగ్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడున్న ప్రైవసీ సెక్షన్ ఓపెన్ చేయాలి. కిందికి స్క్రోల్ చేసిన తర్వాత కాల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ.. కాల్స్ విభాగంలో సైలెంట్ అన్ నోన్ కాల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అది ఆన్ చేసుకుంటే ఇక అన్ నోన్ కాల్స్ రావు.
Update For I Phone : ఇక.. ఐఫోన్ వాడే వారు.. అన్ నోన్ కాల్స్ ని బ్లాక్ చేయాలంటే ఈ పద్ధతులను పాటించాలి. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్స్‌ని క్లిక్ చేయాలి. అక్కడ ప్రైవసీ దిగువన కాల్స్ అనే సెక్షన్ ఓపెన్ చేయాలి. ఈ కాల్స్ విభాగంలో సైలెంట్ అన్ నోన్ కాల్స్ అనే ఆప్షన్‌ని ఆన్ చేయాలి. ఇలా చేయడం వల్ల.. ఫోన్‌లో సేవ్ కాని వ్యక్తులనుంచి వచ్చే కాల్స్‌ని అడ్డుకునే అవకాశం ఉంటుంది.