Friday, November 22, 2024

వాట్సాప్ యూజ‌ర్ల‌కు గుడ్​న్యూస్​.. అందుబాటులోకి మ‌రో కొత్త ఫీచర్..

మెటా మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే యాప్‌లలో ఒకటి. మెటా వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఎప్ప‌టిక‌ప్ప‌డు కొత్త ఫీచర్లు, అప్‌డేట్‌లను అందిస్తూనే ఉంటుంది. ఇప్పుడు వినియోగదారుల కోసం కంపెనీ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. రెండు రోజుల క్రితమే ఛానళ్లను ప్రవేశపెట్టిన వాట్సాప్‌ ఇప్పుడు ఆన్‌లైన్‌ చెల్లింపుల్లో మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగానే ఆన్‌లైన్‌ పేమెంట్‌ సొల్యూషన్స్‌ కంపెనీలు రేజర్‌పే, పేయూతో ఒప్పందాలు కుదుర్చుకుంది. దీంతో యూజర్లు ఇకపై థర్డ్‌ పార్టీ యాప్‌ను ఆశ్రయించకుండానే నేరుగా వాట్సాప్‌ ద్వారానే డబ్బులు చెల్లించొచ్చు.

పేమెంట్‌ సర్వీసులతో పాటు వాట్సాప్‌ ‘ప్లోస్‌’ (Flows) అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. రెండు, మూడు వారాల్లో ఫ్లోస్‌ అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది. ఇక‌, వాట్పాప్‌ బిజినెస్‌ కోసం మెటా వెరిఫికేషన్‌నూ తీసుకొస్తున్నట్టు తెలిసింది. మెటా వెరిఫైడ్‌ బ్యాడ్జ్‌ తీసుకున్నవారికి మెరుగైన అకౌంట్‌ సపోర్ట్‌, భద్రతను అందించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement