Tuesday, November 19, 2024

టూరిస్టుల‌కు గుడ్ న్యూస్.. థాయిలాండ్ వెళ్లాల‌నుకుంటే ఇదే బెస్ట్ టైం!

థాయిలాండ్ వెళ్లాలి అనుకునే భారతీయులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి థాయిలాండ్ వెళ్లే భారతీయులకు వీసాలు అవసరం లేదు. ఈ విషయాన్ని స్వయంగా థాయిలాండ్ ప్రభుత్వమే వెల్లడించింది. థాయిలాండ్‌కు ఉన్న ప్రధాన పర్యాటక వనరులలో భారతదేశం ఒకటి. కాగా, భారతీయులు ఏటా థాయిలాండ్‌కు పర్యాటకం కోసం భారీగా తరలివెళ్తున్న నేపథ్యంలో… మరింత మంది పర్యాటకులకు రప్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది థాయిలాండ్..

ఇప్పటికే చైనా వాసులు థాయిలాండ్‌లో పర్యటించేందుకు ఎలాంటి వీసాలు అవసరం లేదని ప్రకటించిన థాయ్ ప్రభుత్వం.. తాజాగా అదే రకమైన సదుపాయాలను భారతీయులకు కూడా కల్పించింది. భారత్ నుంచి థాయిలాండ్ వచ్చేవారికి ఎలాంటి వీసాలు అవసరం లేదని స్పష్టం చేసింది. దీంతో మరింత మంది భారతీయులు థాయిలాండ్‌లో పర్యటిస్తే.. అది తమకు ఆర్థికంగా లాభం చేకూరుతుందని థాయ్ సర్కార్ ఈ సదుపాయాన్ని కల్పించింది.

నవంబర్ 10 వ తేదీ నుంచి థాయిలాండ్ వెళ్లే భారతీయులకు ఎలాంటి వీసాలు అక్కర్లేదని స్పష్టం చేసింది. అయితే, ఈ అవకాశం వచ్చే ఏడాది మే 10 వ తేదీ వరకు కొనసాగుతుందని వెల్ల‌డించింది. ఇక‌, ఒకసారి థాయిలాండ్‌కు వచ్చిన భారతీయులు 30 రోజుల వరకు తమ దేశంలో పర్యటించవచ్చని తెలిపింది. కరోనా తర్వా థాయ్‌లాండ్‌ను పర్యటించిన పౌరుల్లో భారత్‌ నాలుగో స్థానంలో నిలిచింది. మొద‌టి స్థానంలో మలేసియా ఉండ‌గా.. ఆ త‌రువాత‌ చైనా, దక్షిణ కొరియా ఉన్నాయి.

మరోవైపు.. శ్రీలంక కూడా తమ దేశంలో పర్యాటకాన్ని మరింత పెంచుకునేందుకు ఇటీవల ఏడు దేశాలకు చెందిన పౌరులు ఎలాంటి వీసాలు లేకుంండా తమ దేశంలో పర్యటించవచ్చని ప్రకటించింది. అందులో భారత్ కూడా ఉండటం గమనార్హం. పైలట్‌ ప్రాజెక్టు కింద 2024 మార్చి 31 వరకు ఈ వీసా రహిత పర్యటనలకు అవకాశం ఉంటుందని శ్రీలంక స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement