తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ బోర్డు శుభవార్త చెప్పింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు కూడా సర్వదర్శనం టోకెన్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే తిరుమల సర్వదర్శనం టోకెన్‌లను టీటీడీ బోర్డు భక్తులందరికి జారీ చేయడం ప్రారంభించింది. మొదట ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లా వాసులుకు మాత్రమే టోకెన్‌లను జారీ చేసిన టీటీడీ బోర్డు ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు వారికి కూడా టోకెన్లు ఇస్తోంది.
తమిళులకు ముఖ్యమైన పెరటాసి మాసం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారు. ప్రస్తుతం జారీ చేస్తున్న టోకెన్‌లను టీటీడీ 2 వేల నుంచి 8 వేలకు పెంచింది. ఇందులో భాగంగానే ఆదివారం నుంచి టీటీడీ నూతన విధానాన్ని అమలు చేస్తోంది. టోకెన్‌ల సంఖ్య పెంచడంతో శ్రీవారి ఆలయంలో టీటీడీ దర్శన సమయాన్ని కూడా పెంచింది. ఈరోజు నుంచి ఏకాంత సేవను టీటీడీ బోర్డు 11:30 గంటలకు నిర్వహించనుంది.