గ్రాడ్యుయేట్స్, నిరుద్యోగులకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) గుడ్‌న్యూస్ చెప్పింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ కలిసి ఫ్రీ ఆన్లైన్ కోర్సును ఇస్రో ప్రకటించింది. ‘జియోడేటా ప్రాసెసింగ్ యూజింగ్ పైథాన్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రామ్ 2024, ఇప్పటికే ప్రారంభం కాగా… ఈ నెల 27 వరకు కొనసాగుతుంది. కోర్సు పూర్తి చేసేవారు జియోస్పేషియల్, శాటిలైట్ డేటా ప్రాసెసింగ్ వంటి సబ్జెక్టులపై పట్టు సాధించవచ్చు. భారత ప్రభుత్వం ఈ కోర్సును స్పాన్సర్ చేస్తోంది.
అర్హతలు
అండర్ గ్రాడ్యుయేట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ లేదా గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ దీనికి అర్హులు. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వంలో సైన్స్ లేదా టెక్నాలజీ రిలేటెడ్ రోల్స్‌లో పని చేస్తూ ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. CIET లేదా CEC-UGC నెట్వర్క్ యూజర్లు కూడా అప్లై చేసుకోవచ్చు. యూనివర్సిటీ లేదా ఇలాంటి సంస్థలో ఉపాధ్యాయులు లేదా పరిశోధకులు కూడా దీనికి అర్హులే.
కోర్సులో చేరడానికి ఇవి తప్పనిసరి
కోర్సులో చేరడానికి అభ్యర్థుల వద్ద వెబ్‌క్యామ్, మైక్రోఫోన్, స్పీకర్లతో కూడిన డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ ఉండాలి. క్లాస్రూమ్ కోర్సులో చేరాలనుకుంటే బిగ్ డిస్ప్లే స్క్రీన్, ప్రొజెక్టర్ లేదా టీవీ అవసరమవుతాయి. ఫాస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా తప్పనిసరి. ఈ కోర్సు ఉచితం కాబట్టి కోర్సులో చేరడానికి మనీ చెల్లించనక్కర్లేదు.