Wednesday, November 6, 2024

Singareni | సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్..

సింగరేణి కార్మికులకు ఆ సంస్థ శుభవార్త చెప్పింది. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న బదిలీ వర్కర్లను రెగ్యులరైజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈమేర‌కు 2,364 మంది బదిలీ కార్మికులను జ‌న‌ర‌ల్ మజ్జుద్‌లుగా రెగ్యులరైజ్ చేస్తున్నట్లు సీఎండీ ఎన్.బలరాం తెలిపారు.

సంస్థలో చేరినప్పటి నుంచి ఏడాదిలో 190 రోజులు భూగర్భ గనులు, 240 రోజులు ఉపరితల గనుల్లో పనిచేసిన వారిని క్రమబద్ధీకరిస్తున్న‌ట్టు పేర్కొన్నారు. సెప్టెంబరు 1వ తేదీ నుంచి వీరిని జనరల్ మజ్దూర్​లుగా గుర్తించబోతున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి నిరీక్షణ లేకుండా ఏడాదిలో నిర్ణీత మస్టర్లు పూర్తి చేసిన వారిని జనరల్ మజ్దూర్లుగా గుర్తిస్తుండటం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement