Thursday, November 21, 2024

ఎస్‌బీఐ ఫిక్స్‌డ్‌ డిపాజిటర్ల‌కు శుభ‌వార్త‌.. వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం..

దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వడ్డీ రేటును 10 బేసిస్‌ పాయింట్లు మేర పెంచుతున్నట్టు వివరించింది. అయితే ఇది కేవలం రూ.2కోట్ల కంటే ఎక్కువ ఉన్న ఎఫ్‌డీలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. పెరిగిన వడ్డీ రేట్లు డిసెంబర్‌ 15, 2021 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.

కొత్త డిపాజిట్‌లతో పాటు ప్రస్తుతం ఉన్న వాటికి కూడా వర్తిస్తుందని వివరించింది. రూ.2 కోట్ల లోపు ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను అలాగే ఉంచింది. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల మధ్య కాలపరిమితి ఉన్న ఎఫ్‌డీపై సాధారణ పౌరుడికి 2.9 శాతం నుంచి 5.4 శాతం వడ్డీ అందిస్తుంది. అదే సీనియర్‌ సిటిజన్‌ అయితే.. 50 బేసిస్‌ పాయింట్లు అదనంగా యాడ్‌ అవుతాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement