Monday, November 18, 2024

ప‌సిడి ప్రియుల‌కు గుడ్ న్యూస్‌… భారీగా త‌గ్గిన ధ‌ర‌లు..

బంగారం ప్రియుల‌కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. గ‌త కొంత‌కాలంగా వ‌రుస‌గా పెరుగుతూ వ‌స్తున్న బంగారం ధ‌ర‌లు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి. వ‌రుస‌గా మూడు రోజుల్లో రూ.1000 వ‌ర‌కు ధ‌ర త‌గ్గింది. వెండి రూ.2500 పైగా పతనమైంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర క్రితం రెండు సెషన్లలో రూ.850 మేర తగ్గగా.. ఇవాళ్ల కూడా రూ.100 మేర దిగివచ్చింది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్‌లో రూ.50 వేల 900 మార్క్ వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం హైదరాబాద్‌లో తులానికి రూ.100 మేర తగ్గి ప్రస్తుతం రూ.55 వేల 530 వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.100 మేర తగ్గి ప్రస్తుతం రూ.51,050 వద్ద ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.100 తగ్గి ప్రస్తుతం రూ.55 వేల 680 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికి వస్తే బంగారం దారిలోనే భారీగా పడిపోతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి క్రితం సెషన్‌లో ఏకంగా రూ.2500 మేర పడిపోగా.. ఇవాళ సైతం రూ.100 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 67 వేల 400 వద్ద అమ్ముడవుతోంది. ఇక దేశ రాజధాని దిల్లీలో కిలో వెండి ధర క్రితం సెషన్‌లో ఏకంగా రూ.4450 మేర పడిపోయగా ఇవాళ రూ.100 తగ్గింది ప్రస్తుతం రూ.65 వేల 450 వద్ద కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement