Friday, November 22, 2024

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. పడిపోతున్న బంగారం, వెండి ధరలు..!

పసిడి ప్రియులకు అదిరిపోయే శుభ వార్త. వారం రోజుల్లో బంగారం తులానికి రూ.700 మేర తగ్గింది. వెండి సైతం అదే దారిలో భారీగా దిగివచ్చింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల తులం బంగారం ధర క్రితం సెషన్‌తో పోలిస్తే స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం తులానికి ధర రూ.52 వేల 400 వద్ద ట్రేడవుతోంది. వారం రోజుల్లో రూ.700 మేర తగ్గింది. మరోవైపు.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములకు రూ.80 తగ్గింది. ప్రస్తుతం రూ.57 వేల 160 వద్ద కొనసాగుతోంది. ఇక దేశ రాజధాని దిల్లీలో కూడా బంగారం ధర తగ్గింది. గడిచిన వారం రోజుల్లో 22 క్యారెట్ల గోల్డ్ తులానికి రూ.800 మేర దిగివచ్చింది. ప్రస్తుతం క్రితం సెషన్‌తో పోలిస్తే ఎలాంటి మార్పు లేకుండు 22 క్యారెట్ల తులం బంగారం రూ. 52.550 వద్ద ట్రేడవుతోంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రేటు రూ.57,310 వద్ద కొనసాగుతోంది. ఇక చెన్నైల 22 క్యారెట్ల బంగారం రూ.150 తగ్గి రూ.53,150 వద్ద ట్రేడవుతోంది. 24 క్యారెట్ల బంగారం రూ.160 తగ్గి రూ.57 వేల 980 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికి వస్తే బంగారం దారిలో నడుస్తూ ధరలు పడిపోతున్నాయి. వారం రోజుల్లో భారీగానే దిగివచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో సిల్వర్ రేటు రూ.500 మేర తగ్గింది. ప్రస్తుతం కిలోకి రూ.72,000 వద్ద కొనసాగుతోంది. మరోవైపు.. దేశ రాజధాని దిల్లీలో కిలో వెండి రూ.450 తగ్గి ప్రస్తుతం రూ.69 వేల 950 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌తో పోలిస్తే హస్తినాలో గోల్డ్ ధర కాస్త ఎక్కువగా, వెండి ధర కాస్త తక్కువగా ఉంటుంది. స్థానికంగా ఉంటే ట్యాక్స్ వల్ల ధరల్లో మార్పులు ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement