Friday, November 22, 2024

ఎన్‌ఆర్‌ఐలకు గుడ్‌ న్యూస్‌.. ఇండియా నెంబర్‌ లేకుండానే యూపీఐ వాడొచ్చు

నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్స్‌ (ఎన్‌ఆర్‌ఐ)లు త్వరలోనే తమ ఇంటర్నేషనల్‌ నెంబర్‌తోనే యూపీఐ ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చు. మన దేశంలో వారికి బ్యాంక్‌ అకౌంట్‌ ఉండాల్సి ఉంటుంది. ఇండియా ఫోన్‌నెంబర్‌ లేకుండానే వారి దేశంలో వాడుతున్న నెంబర్‌తోనే యూపీఐ ద్వారా చెల్లింపులు, మనీ ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. ఎన్‌ఆర్‌ఈ, ఎన్‌ఆర్‌ఓ అకౌంట్స్‌ ఉన్న ఎన్‌ఆర్‌ఐలు యూపీఐ ప్లాట్‌ఫామ్‌ ఉపయోగించుకోవచ్చని నేషనల్‌ పేమెంట్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా ( ఎన్‌పీసీఐ) ప్రకటించింది.

ప్రస్తుతానికి 10 దేశాల్లో ఉన్న ఎన్‌ఆర్‌ఐలకు ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపింది. సింగపూర్‌, ఆస్ట్రేలియా, కెనడా, హంగ్‌ కాంగ్‌, ఒమన్‌, ఖతార్‌, అమెరికా, సౌదీ అరేబియా, యూనైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, బ్రిటన్‌ దేశాల్లో ఉన్న ఎన్‌ఆర్‌ఐలు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. దీనికి వారు ఉంటున్న దేశ కోడ్‌ను ఫోన్‌నెంబర్‌కు ముందు ఉపయోగించాల్సి ఉంటుంది. నిబంధనలకు లోబడే లావాదేవీలను అనుమతి ఇస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement