Wednesday, November 20, 2024

నాన్‌వెజ్ లవర్స్‌కి గుడ్ న్యూస్‌.. భారీగా త‌గ్గిన చికెన్ ధ‌ర‌లు..

సండే వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరి ఇంట్లో నాన్ వెజ్ కర్రీ ఉండాల్సిందే. ముక్క లేనిదే ముద్దా దిగదు అనే వారు. కానీ ఇప్పుడు ఆలా కాదు సండే , మండే అనే తేడాలేకుండా ఎప్పుడు తినాలపిస్తే అప్పుడు తినేస్తున్నారు. అయితే గత కొద్దీ రోజులుగా చికెన్ ధర కొండెక్కి కూర్చుంది. కిలో చికెన్ ధర దాదాపు రూ. 250-270 వరకు ఉంది. చాలామంది ఈ ధర చూసి వామ్మో అని తినడం మానేస్తున్నారు. కాగా ప్రస్తుతం చికెన్ ధరలు భారీ తగ్గుతున్నాయి. మాంసం ప్రియుల‌కు ఇది ఒక శుభవార్తే.. క‌రోనా కాలంలో అయితే ఏకంగా రూ.300 వ‌ర‌కు విక్ర‌యించారు. దీంతో సామాన్యులు చికెన్ కొనేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌లేదు. పక్షం రోజుల క్రితం హైదరాబాద్ -నగరంలో రూ.250 నుంచి రూ. 270 మార్కు దాటిన చికెన్ ధరలు… ప్రస్తుతం రూ.160కి చేరింది. ప్రతి ఏటా వేసవి ఆరంభంలో 30 నుంచి 40 శాతం చికెన్ అమ్మకాలు తగ్గుతాయని వ్యాపారులు అంటున్నారు. ఉత్పత్తి పెరగడం, డిమాండ్ తగ్గడం వల్లనే ధరల్లో భారీ వ్యత్యాసం వచ్చిందని వారు అంటున్నారు. ధరలు భారీగా తగ్గడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. నాటు కోడి చికెన్ ధర కూడా భారీగా పడిపోయింది. నిన్నటి వరకు రూ.500 పలికిన నాటు చికెన్ ప్రస్తుతం 350 నుంచి 400 పలుకుతోంది. నాటు కోళ్ల ఉత్పత్తి కూడా భారీగా పెరుగడం వల్ల ధరలు తగ్గనున్నట్టు తెలుస్తోంది. ఖమ్మం తదితర జిల్లాల నుంచి హైదరాబాద్‌కు నాటు కోళ్లు డిమాండ్‌కు మించి వస్తున్నట్టు వ్యాపారులు అంటున్నారు. ఫారాల్లో పెంచే కడక్ నాథ్ కోళ్లు కూడా మార్కెట్లోకి అంచనాలకు మించి రావడంతో ధరలు దిగాయిని భావిస్తున్నారు. నగరానికి పెద్ద మొత్తంలో కోళ్లు మెదక్, కరీంనగర్ తదితర జిల్లాలను రావడం, అమ్మకాలు తగ్గడం మూలంగానే ధరలు దిగొస్తున్నాయని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement