ఆంధ్రప్రభ, హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకల్లో మందు బాబులకు అర్ధరాత్రి వరకు లిక్కర్ అందుబాటులో ఉంచేలా సర్కార్ నిర్ణయం తీసుకున్నది. కొత్త ఏఉడాదికి స్వాగతం పలుకుతూ జరుపునే న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనే మందుబాబులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మద్యం విక్రయాల సమయాన్ని అర్ధరాత్రి వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 31న రిటైల్ దుకాణాల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్లు, పబ్బులలో రాత్రి ఒంటి గంట వరకు మద్యానికి అనుమతులిచ్చింది.
అదేవిధంగా న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పోలీసులు పలు నిబంధనలను తీసుకొచ్చారు. తీస్టార్, ఆపై హోటళ్లు, పబ్బులు, క్లబ్బుల ప్రవేశ ద్వారాలు, నిష్క్‌మ్రణ ద్వారాఈల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అసభ్యకర నృత్యాలులేకుండా చేసుకోవాలని, వేడుకల్లో శబ్ద తీవ్రత 45 డెసిబిల్స్‌కు మించొద్దని పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పబ్బులు, క్లబ్బులు, బార్లలో మైనర్లను అనుమతించొద్దని స్పష్టమైన ఆదేశాలు వెలువరించారు.